నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి50

ABN , First Publish Date - 2020-12-17T21:35:29+05:30 IST

నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీశ్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 రాకెట్ నింగిలోకి

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి50

శ్రీహరికోట:  నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీశ్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. నిజానికి ప్రయోగం పలుమార్లు వాయిదా పడి చివరికి నేడు చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభించనున్నాయి. దీని పరిమితి  భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు విస్తరించనుంది.


ఏడు సంవత్సరాలపాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు. భారత్ ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇది. పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 50వది కాగా,  పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది. షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని ఇస్రో పేర్కొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంత దీనిని తయారుచేశారు. సి-బ్యాండ్ సేవల విస్తరణకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. 

Updated Date - 2020-12-17T21:35:29+05:30 IST