వ్యవసాయ చట్టాలపై నిరసన : బిహార్‌లో రైతులపై లాఠీఛార్జ్

ABN , First Publish Date - 2020-12-29T21:41:05+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న

వ్యవసాయ చట్టాలపై నిరసన : బిహార్‌లో రైతులపై లాఠీఛార్జ్

పాట్నా : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గాంధీ మైదానంలో ఉన్న వందలాది మంది రైతులు రాజ్‌భవన్‌కు కవాతుగా వెళ్లేందుకు ప్రయత్నించినపుడు, వారిపై స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి, వాటర్ కెనన్లను ప్రయోగించారు. 


ఈ మైదానంలోని 6వ నెంబరు గేటు తాళాలను పగులగొట్టి, రోడ్డుపైకి కవాతుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అఖిల భారతీయ కిసాన్ సంఘర్ష్ సమన్వయ సమితి, వామపక్షాలకు సంబంధించిన రైతులు వందలాది మంది గాంధీ మైదానానికి మంగళవారం ఉదయం చేరుకున్నారు. వీరు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ మైదానంలోని 6వ నెంబరు గేట్‌ తాళాలను పగులగొట్టారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. అనంతరం కవాతుగా రాజ్ భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే రైతులను అడ్డుకున్నారు. లాఠీఛార్జ్ చేసి, వాటర్ కెనన్లను ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ నినాదాలు చేశారు. 


Updated Date - 2020-12-29T21:41:05+05:30 IST