దస్తావేజులు లేకున్నా రుణాలు

ABN , First Publish Date - 2020-10-12T07:37:32+05:30 IST

ఆస్తి యాజమాన్య హక్కులకు సంబంధించిన కార్డుల (ప్రాపర్టీ కార్డ్స్‌) పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగని ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసిన ప్రసంగంలో అభివర్ణించారు...

దస్తావేజులు లేకున్నా రుణాలు

  • గ్రామీణులకు ప్రాపర్టీ కార్డుల పంపిణీ షురూ
  • చరిత్రాత్మక పథకమన్న మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 11: ఆస్తి యాజమాన్య హక్కులకు సంబంధించిన కార్డుల (ప్రాపర్టీ కార్డ్స్‌) పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర  మోదీ  ప్రారంభించారు. స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగని ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసిన ప్రసంగంలో అభివర్ణించారు. గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేందుకు, వారికి బ్యాంకుల్లో సులభంగా రుణాలు లభించేట్లు చేయడానికి దీనిని ఉద్దేశించినట్లు ప్రధాని వివరించారు.


ఈ పథకం పేరు: స్వమిత్వ (సర్వే ఆఫ్‌ విలేజెస్‌, మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రొవైజ్డ్‌ టెక్నాలజీ  ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) యోజన! ఈ పథకంలో తొలి దశగా ఆరు రాష్ట్రాలు- మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, కర్ణాటక)ల్లోని 763 గ్రామాల్లోని లక్షమంది గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రాపర్టీ కార్డులందజేస్తారు. వీటిని పంపిణీ చేసేది ఆయా రాష్ట్రప్రభుత్వాలే! సరైన దస్తావేజు లు లేకున్నా ఈ కార్డులు చూపి గ్రామీణులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.  ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులనూ స్వమిత్వ ద్వారా నిర్ధారిస్తారు. ఆలయాలు, పంచాయతీ, స్కూలు, పీహెచ్‌సీ భవనాలు, చెరువులు స్మశానవాటికలన్నింటి సరిహద్దులనూ నిర్ణయించి రికార్డుల్లో భద్రపరుస్తారు. 


కాంగ్రె్‌సపై విమర్శల దాడి

ఈ పథక ప్రారంభం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం బిహార్‌ ఎన్నికల ప్రచార సభను తలపించింది. ‘గత ఆరేళ్లుగా దేశంలో గ్రామాలకు ఎన్నో ఎంతో చేశాం. అంతకుముందు ఆరు దశాబ్దాలుగా చేయనివి చేశాం. ఇన్నేళ్లూ పాలించిన ప్రభుత్వాలు గ్రామీణులను వారి ఖర్మానికి వారిని ఒదిలేశాయి. గ్రామాలు, పేదలు, రైతులు, శ్రామికులు స్వావలంబన సాధించడం వారికి (కాంగ్రె్‌సకు)ఇష్టం లేదు. వారు మధ్య దళారులు, కమిషన్‌  ఏజెం ట్లు, బ్రోకర్ల వ్యవస్థనే వారు కోరుకుంటున్నారు. దాన్నిపుడు మేం తుంచేశాం’ అని ప్రధాని సాగు చట్టాలను సమర్థించుకుంటూ విమర్శలు గుప్పించారు. 


జేపీకి మోదీ ఘన నివాళి

సోషలిస్ట్‌ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌కు, ఆర్‌ఎ్‌సఎస్‌ నేత నానాజీ దేశ్‌ముఖ్‌కు వారి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఘన నివాళులర్పించారు. సాధారణంగా ప్రముఖుల జయంతి, వర్థంతి వచ్చినపుడు వారిని స్మరిస్తూ ట్వీట్లు చేసే ప్రధాని ఈసారి వీరిరువురి చిత్రపటాలను నేపథ్యంలో ఉంచి, వారు దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం విశేషం. 


Updated Date - 2020-10-12T07:37:32+05:30 IST