నేరచరితులు రాజకీయ పార్టీ పెట్టకుండా నిషేధించండి

ABN , First Publish Date - 2020-09-16T07:36:10+05:30 IST

నేరచరితులు రాజకీయ పార్టీ పెట్టకుండా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేశారు.

నేరచరితులు రాజకీయ పార్టీ పెట్టకుండా నిషేధించండి

సుప్రీం కోర్టులో ఐఏ దాఖలు చేసిన అశ్వినీ కుమార్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): నేరచరితులు రాజకీయ పార్టీ పెట్టకుండా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేశారు. రాజకీయ నాయకులు నేరచరితులైనప్పటికీ పార్టీ అధ్యక్షులుగా, ప్రభుత్వాధినేతలుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారని, వీరిపై కేసుల విచారణను ఏడాదిలోపు తేల్చేయడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


ప్రజాప్రతినిధులకు కనీస అర్హతలు, గరిష్ఠ వయోపరిమితిని కూడా విధించాలని ప్రతిపాదించారు. అవినీతిపరులు, నేరస్తులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులకు సంబంధించి అశ్వినీకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనే సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అప్లికేషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


Updated Date - 2020-09-16T07:36:10+05:30 IST