వ్యవసాయ బిల్లులతో కార్పొరేట్లకే లాభం: నామా

ABN , First Publish Date - 2020-09-24T07:24:18+05:30 IST

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, కార్పొరేట్‌ సంస్థలకే లాభం కలుగుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు.

వ్యవసాయ బిల్లులతో కార్పొరేట్లకే లాభం: నామా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, కార్పొరేట్‌ సంస్థలకే లాభం కలుగుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని బలహీనపర్చేలా ఈ బిల్లులు ఉన్నాయని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో నామాతోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, పసునూరి దయాకర్‌, శ్రీనివా్‌సరెడ్డి నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జై జవాన్‌... జై కిసాన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ కొత్త బిల్లుల్లోని విధానాలు అమల్లోకి వస్తే పంటలకు మద్దతు ధర అందదని వివరించారు. ఇదిలా ఉండగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం రూపొందించిన పోస్టల్‌ స్టాంప్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

Updated Date - 2020-09-24T07:24:18+05:30 IST