వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ప్రియాంకా వాద్రా కామెంట్స్

ABN , First Publish Date - 2020-07-10T21:09:30+05:30 IST

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేతలు

వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ప్రియాంకా వాద్రా కామెంట్స్

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేతలు-గ్యాంగ్‌స్టర్లు చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. దీనికి కాన్పూర్ ఘటన ఉదాహరణ అంటూ ఆమె ట్వీట్ చేశారు. వీడియో సందేశం కూడా జత చేశారు. కాన్పూర్ ఘటనతో పాటు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ వరకూ పూర్తి స్థాయిలో న్యాయవిచారణ జరిపించాలని ఆమె కోరారు. 
మరోవైపు దుబేకు కాన్పూర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం కొనసాగుతోంది. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. దుబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లున్నాయని వైద్యులు తెలిపారు. నిన్న ఉజ్జైన్ నుంచి దుబేను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో దుబే పోలీసుల దగ్గర్నుంచి 9ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోతూ కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో దుబే హతమయ్యాడని చెప్పారు. ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు, కమెండోలు గాయపడ్డారు. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 


జులై రెండున బిక్రూ గ్రామంలో దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. 

Updated Date - 2020-07-10T21:09:30+05:30 IST