కేజ్రీవాల్ స్ఫూర్తిగా యూపీలో చక్రం తిప్పేందుకు ప్రియాంక సన్నాహాలు!

ABN , First Publish Date - 2020-02-12T16:12:45+05:30 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఉత్తరప్రదశ్‌లో కింది స్థాయిలో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ...

కేజ్రీవాల్ స్ఫూర్తిగా యూపీలో చక్రం తిప్పేందుకు ప్రియాంక సన్నాహాలు!

లక్నో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఉత్తరప్రదశ్‌లో కింది స్థాయిలో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ, యూపీ పార్టీ అధ్యక్షులు కుమార్ లల్లూలు విశేషమైన కృషి చేస్తున్నారు. మిషన్ 2022ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇప్పుడు కేజ్రీవాల్‌ను స్ఫూర్తిగా తీసుకోనున్నదని తెలుస్తోంది. విద్యుత్, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, రైతాంగ సమస్యలను ఆయుధంగా చేసుకోని రాజయకీయ మనుగడ సాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ సమాజ్‌వాదీ పా‌ర్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు  చెందిన పార్లమెంట్ స్థానమైన ఆజమ్‌గఢ్‌కు ఈరోజు వెళ్లనున్నారు. అక్కడ సీసీఏను వ్యతిరేకించి, పోలీసు చర్యలతో జైలు పాలయినవారిని వారి కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. 


Updated Date - 2020-02-12T16:12:45+05:30 IST