ఆ వెయ్యి బస్సులేవో అక్కడ తిప్పాలి: ప్రియాంక గాంధీకి యూపీ మంత్రి కౌంటర్
ABN , First Publish Date - 2020-05-18T00:58:55+05:30 IST
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వలస కూలీలను తరలించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా

లక్నో: కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వలస కూలీలను తరలించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బస్సులను ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలు వసల కూలీల కోసం అతి తక్కువ రైళ్లను మాత్రమే అడిగాయన్నారు.
వలస కూలీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సురక్షితంగా, భద్రంగా తరలించిందని మంత్రి నొక్కిచెప్పారు. తాము ప్రతీ జిల్లాకు 200 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి 400 రైళ్లను కేటాయించినట్టు చెప్పారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు కొన్ని రైళ్లను మాత్రమే అడిగాయని, కాబట్టి ప్రియాంక గాంధీ చెప్పిన 1000 బస్సులను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు శనివారం ప్రియాంక గాంధీ లేఖ రాస్తూ వలస కార్మికులను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు వెయ్యి బస్సులు నడిపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.