లక్ష మాస్క్‌లు పంపిన ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2020-05-09T01:46:30+05:30 IST

కోవిడ్-19తో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌కు లక్ష మాస్క్‌లు పంపారు. శనివారం నుంచి..

లక్ష మాస్క్‌లు పంపిన ప్రియాంక గాంధీ

లక్నో: కోవిడ్-19తో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌కు లక్ష మాస్క్‌లు పంపారు. శనివారం నుంచి ఈ మాస్క్‌ల పంపిణీ జరుగుతుందని యూపీ కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త లలన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది ప్రజలకు వండిన ఆహారం, రేషన్‌ను కూడా తమ పార్టీ అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.


కాగా, ఇంతవరకూ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56,342కు చేరిందని, వీటిలో 37, 917 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. 16,539 మంది పేషెంట్లు పూర్తి స్వస్థతతో డిశ్చార్చ్ కాగా, మృతుల సంఖ్య 1,886కు చేరింది.

Updated Date - 2020-05-09T01:46:30+05:30 IST