టీ తాగేందుకు రావాలంటూ... బీజేపీ ఎంపీని ఆహ్వానించిన ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2020-07-27T12:58:15+05:30 IST

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని

టీ తాగేందుకు రావాలంటూ... బీజేపీ ఎంపీని ఆహ్వానించిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ ఎంపీ  అనిల్ బలూనీని తేనీటి విందుకు ఆహ్వానించారు. ఆమె తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఆ భవనాన్ని బీజేపీ ఎంపీ బలూనికి ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఆ ఎంపీ కుటుంబాన్ని చాయ్ తాగడానికి ఆహ్వానించారు.


ఈ విషయంపై ఆయన కార్యాలయానికి ఫోన్ చేయగా... ఆ ఎంపీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఓ లేఖ కూడా ప్రియాంక పంపినట్లు సమాచారం. అయితే ఆ  ఆహ్వానంపై బీజేపీ ఎంపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా రాజకీయ ప్రత్యర్థులకు గౌరవ పురస్సరంగా ఆహ్వానాలు పంపడం అత్యంత ఆరోగ్యకరమైన వాతావరణమని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బంగళాను ఎందుకు ఖాళీ చేశారు?

1997 నుంచి ప్రియాంక కుటుంబం 35 లోధీ స్టేట్ బంగళాలో నివాసం ఉంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ వీరికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకుంది. దీంతో ఆ బంగళాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె ఈ బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రియాంక గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్నారని, త్వరలోనే ఆమె తిరిగి హస్తినకు వచ్చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-07-27T12:58:15+05:30 IST