హాథ్రస్ : బాధితురాలికి న్యాయం కావాలి.. అపవాదు కాదు : ప్రియాంక

ABN , First Publish Date - 2020-10-08T20:55:15+05:30 IST

హాథ్రస్ బాధితురాలిపై రోజుకో కథనం పుట్టుకొస్తుండటంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

హాథ్రస్ : బాధితురాలికి న్యాయం కావాలి.. అపవాదు కాదు : ప్రియాంక

లక్నో : హాథ్రస్ బాధితురాలిపై రోజుకో కథనం పుట్టుకొస్తుండటంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి విషయంలో వస్తున్న పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘‘స్త్రీకి న్యాయం కావాలి. అంతే తప్ప అపవాదు కాదు. సిగ్గులేని బీజేపీ’’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రియాంక ధ్వజమెత్తారు. స్త్రీల పాత్రను కించపరిచే విధంగా కథనాలను సృష్టిస్తున్నారని, పైగా నేరాలకు ఆమెనే బాధ్యురాలిగా చిత్రిస్తూ... తిరోగమనం వైపు వెళ్తున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 

Updated Date - 2020-10-08T20:55:15+05:30 IST