ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టండి... పబ్లిసిటీపై కాదు : ప్రియాంక
ABN , First Publish Date - 2020-06-22T20:26:54+05:30 IST
సీఎం యోగిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మరోసారి ఫైరయ్యారు. ప్రచార ఆర్భాటాలపై పెట్టే శ్రద్ధను కాస్త,

లక్నో : సీఎం యోగిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మరోసారి ఫైరయ్యారు. ప్రచార ఆర్భాటాలపై పెట్టే శ్రద్ధను కాస్త, ప్రజల సమస్యలపైకి మళ్లించండి అంటూ చురకలంటించారు. ‘‘యోగి ప్రభుత్వం యువకులకు లక్షలాది ఉద్యోగాలు కల్పించామని చెబుతోంది. కానీ కాన్పూర్‌కు చెందిన యువజంట ఉద్యోగం కోల్పోవడంతో ఆత్మహత్య చేసుకుంది. యోగి ప్రభుత్వం పబ్లిసిటీ కంటే ప్రజల అవసరాలపై శ్రద్ధ పెట్టాలి.’’ అంటూ ప్రియాంక మండిపడ్డారు.