ప్రైవేటు ఆఫీసులు తెరవచ్చు. కానీ.. ప్రభుత్వం కొత్త సూచన!
ABN , First Publish Date - 2020-05-19T04:01:19+05:30 IST
భారత్‌లో లాక్‌డౌన్ 4 ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.

న్యూఢిల్లీ: భారత్‌లో లాక్‌డౌన్ 4 ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు. అయితే సాధ్యమైనంత వరకు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయించాలని సూచించారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు కుదిరినంత మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని చెప్పారు. తద్వారా కరోనా భయాన్ని కొంత వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.