రోదసిలో ప్రైవేటు జెండా
ABN , First Publish Date - 2020-06-01T06:50:17+05:30 IST
మానవసహిత అంతరిక్షయాత్రలపై ఇన్నాళ్లుగా ప్రభుత్వాలకే ఉన్న ఆధిపత్యాన్ని.. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ బద్దలుగొట్టింది. రోదసియానాల చరిత్రలోనే తొలిసారిగా వ్యోమగాములను రోదసి కక్ష్యలోకి...
- ‘స్పేస్ ఎక్స్’ మానవ సహిత రోదసి యాత్ర
వాషింగ్టన్, మే 31: మానవసహిత అంతరిక్షయాత్రలపై ఇన్నాళ్లుగా ప్రభుత్వాలకే ఉన్న ఆధిపత్యాన్ని.. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ బద్దలుగొట్టింది. రోదసియానాల చరిత్రలోనే తొలిసారిగా వ్యోమగాములను రోదసి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా ‘మానవ సహిత రోదసియాత్ర’ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, చైనా అంతరిక్ష సంస్థల సరసన నిలిచింది. ప్రముఖ ఆంత్రప్రెన్యూర్.. టెస్లా కార్ల సంస్థ అధినేత ఈలాన్‌మ్‌స్కకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. ‘క్రూ డ్రాగన్’ అనే వ్యోమనౌకలో ఇద్దరు అమెరికా వ్యోమగాములను మోసుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దిశగా శనివారం రాత్రి 7:22కు(భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక.. 12:52 గంటలకు) దూసుకుపోయింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. 19 గంటలపాటు రోదసిలో ప్రయాణించిన ఈ క్యాప్సూల్ ఐఎ్‌సఎ్‌సతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అనుసంధానం (డాకింగ్) అయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలానియా, వేలాదిమంది అమెరికన్లు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.