జైలు పక్షులకు కరోనా రెక్కలు!
ABN , First Publish Date - 2020-05-18T07:42:50+05:30 IST
ఖైదీలకూ కరోనా వైరస్ సోకుతుండటంతో అన్ని రాష్ట్రా లు వారిని తాత్కాలికంగా విడుదల చేస్తున్నాయి. జైళ్లలో వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో ఖైదీలకు మధ్యంతర బెయిలు లేదా పెరోల్ ఇచ్చి బయటికి...

- వైరస్ వ్యాప్తితో వేల సంఖ్యలో ఖైదీల విడుదల
న్యూఢిల్లీ, మే 17: ఖైదీలకూ కరోనా వైరస్ సోకుతుండటంతో అన్ని రాష్ట్రా లు వారిని తాత్కాలికంగా విడుదల చేస్తున్నాయి. జైళ్లలో వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో ఖైదీలకు మధ్యంతర బెయిలు లేదా పెరోల్ ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి. తద్వారా ఖైదీల సంఖ్యను తగ్గించి భౌతికదూరం పాటించే వీలు కల్పిస్తున్నాయి. ఒక్క యూపీలోనే వివిధ జైళ్ల నుంచి 16 వేల మందిని విడుదల చేశారు. మహారాష్ట్రలో 7200 మందికి పైగా విడుదల చేసినట్లు, త్వరలో మరో 10 వేల మందిని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో 6500 మందిని విడుదల చేశారు. వీరిలో 3900 మందికి పెరోల్ ఇవ్వగా, 2600 మందికి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులో 6వేల మందిని విడుదల చేయగా.. 13,500 మంది జైళ్లలో ఉన్నారు. అసోంలో 3577 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైళ్లశాఖ ఐజీ తెలిపారు.