సౌదీ యువరాజుకు ఫైజర్ టీకా
ABN , First Publish Date - 2020-12-27T09:25:21+05:30 IST
ఫైజర్-బయో ఎన్‌టెక్ సంస్థ తయారుచేసిన కరోనా టీకాను సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వేసుకున్నారు.

ఫైజర్-బయో ఎన్‌టెక్ సంస్థ తయారుచేసిన కరోనా టీకాను సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వేసుకున్నారు. వ్యాక్సిన్‌పై దేశ ప్రజల్లో భరోసా నింపేందుకు యువరాజు ముందుకొచ్చారు. ‘నేను టీకా వేయించుకున్నా. అవిశ్రాంతంగా కృషి చేసి.. టీకా తయారీని సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కృతజ్ఞతలు’ అని బిన్ సల్మాన్ ప్రకటించారు. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా వేయించుకున్న సంగతి తెలిసిందే.