సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై
ABN , First Publish Date - 2020-03-08T16:36:01+05:30 IST
సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై చెప్పారు. సామాజిక మాధ్యమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తాను గతంలో చెప్పినట్టుగానే సామాజిక మాధ్యమాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇకపై తన సోషల్ మీడియా అకౌంట్లను ఏడుగురు మహిళామణులు హ్యాండిల్ చేస్తారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రతిభామూర్తులు ఉన్నారని.. వారంతా విభిన్న రంగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు. వారి పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి విజయోత్సవ సంబరాలు చేసుకుంటూనే.. వారి నుంచి నేర్చుకుందామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ‘నారీ శక్తి’ పురస్కారాలు అందించనున్నారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.