కరోనా ఎఫెక్ట్: సింగపూర్‌కు సహకారం అందిస్తామన్న మోదీ

ABN , First Publish Date - 2020-04-24T23:11:10+05:30 IST

న్యూఢిల్లీ: కరోనా వేళ సింగ‌పూర్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు.

కరోనా ఎఫెక్ట్: సింగపూర్‌కు సహకారం అందిస్తామన్న మోదీ

న్యూఢిల్లీ: కరోనా వేళ సింగ‌పూర్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలతో పాటు వైద్య పరికరాలు, మందులు పంపిస్తామని చెప్పారు. సింగ‌పూర్ ప్రధాని లీ లూంగ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్‌లో మాట్లాడారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎదురౌతున్న ఆరోగ్య, ఆర్ధిక సవాళ్లపై చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సింగపూర్‌లో ఉన్న భారతీయులకు అందుతున్న సహాయంపై మోదీ లీ లూంగ్‌కు ధన్యవాదాలు తెలియజేశారని వెల్లడించింది.


కరోనా నేపథ్యంలో సింగపూర్‌లో లాక్‌డౌన్‌ను జూన్ ఒకటి వరకూ పొడిగించారు.  

Updated Date - 2020-04-24T23:11:10+05:30 IST