డేటా బిల్లు ప్రాథమిక హక్కుకు చేటు: శ్రీకృష్ణ
ABN , First Publish Date - 2020-06-16T08:28:37+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2019 అనేది దేశ సార్వభౌమికత, భద్రతను కాపాడే పేరుతో ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడి...

న్యూఢిల్లీ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2019 అనేది దేశ సార్వభౌమికత, భద్రతను కాపాడే పేరుతో ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడి, వారి ప్రాథమిక హక్కును భంగపరుస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అన్నారు. ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగిస్తూ.. మొత్తం దేశ ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం నిరూపించకపోతే, అది ప్రజల హక్కులను కొల్లగొడుతున్నట్లు భావించాలని అభిప్రాయపడ్డారు. డేటా పరిరక్షణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. స్వేచ్ఛా సమాజానికి ఇది భంగకరమని విమర్శించారు.