దేవత కోరిందని వ్యక్తి తల నరికిన పూజారి అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-29T23:30:24+05:30 IST

సంసారి ఓజా అనే పూజారి కటక్‌లోని నరసింహాపూర్‌లో ప్రాంతం బందహూడాలోని బ్రహ్మణి గుడిలో పూజారి. అయితే ఓజా చెప్పిందాని ప్రకారం.. బ్రహ్మణి దేవత తన కల్లోకి వచ్చి మనిషిని

దేవత కోరిందని వ్యక్తి తల నరికిన పూజారి అరెస్ట్

భుబనేశ్వర్: కరోనా తగ్గడం కోసం వ్యక్తిని ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన పూజారిని ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా తగ్గాలంటే నరబలి ఇవ్వాలని బ్రహ్మణి దేవత కల్లోకి వచ్చి చెప్పిందని, దేవత ఆదేశం మేరకు తాను నరబలి ఇచ్చానని సదరు పూజారి విచారణలో ఒప్పుకున్నాడు. ఒడిషాలోని బందహూడలో బుధవారం జరిగింది ఈ సంఘటన.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘సంసారి ఓజా అనే పూజారి కటక్‌లోని నరసింహాపూర్‌లో ప్రాంతం బందహూడాలోని బ్రహ్మణి గుడిలో పూజారి. అయితే ఓజా చెప్పిందాని ప్రకారం.. బ్రహ్మణి దేవత తన కల్లోకి వచ్చి మనిషిని శిరచ్ఛేదంగా తనకు బలి ఇవ్వాలని కోరిందని, దేవత ఆదేశం మేరకే తాను ఆ పని చేశానని చెప్పాడు’’ అని నిందితుడు ఓజా విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.


వాస్తవానికి దీని వెనుక మరిన్ని వాదనలు వినిపిస్తున్నాయని, ఇద్దరికీ మామిడి తోట విషయంలో గొడవలు కొంత కాలంగా ఉన్నాయని, ఆ కారణంతోనే పూజారి హత్య చేసి ఉంటాడని వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-05-29T23:30:24+05:30 IST