తెలుగు మహిళకు ‘నారీశక్తి’ పురస్కారం
ABN , First Publish Date - 2020-03-09T00:59:52+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు. అయితే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్ కౌర్‌కు నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
1996 లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. భూదేవితో పాటు బీనాదేవి, అరిఫ్ జాన్, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దువరేశి, మన్‌కౌర్, కళావతి దేవి, కౌషికీ చక్రవర్తి, అవని చతుర్వేది, భవనకాంత్, మోహనసింగ్, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ నారీశక్తి పురస్కారాలను అందుకున్నారు.