సామాజిక దూరం పాటించని దేశాధ్యక్షుడు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-05-19T04:12:54+05:30 IST

ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే, లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆందోళనకు దిగి వార్తల్లో నిలిచిన బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో మరోసారి వార్తల్లో నిలిచారు.

సామాజిక దూరం పాటించని దేశాధ్యక్షుడు.. వీడియో వైరల్!

బ్రసీలియా: ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే, లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆందోళనకు దిగి వార్తల్లో నిలిచిన బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో మరోసారి వార్తల్లో నిలిచారు. బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 2.44లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయినా సరే బొల్సనారో మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు తన మద్దతు ఇస్తూనే ఉన్నారు. అధ్యక్ష భవనం ఎదురుగా నిరసన చేసిన ఆందోళనకారులతో ఆయన సన్నిహితంగా ప్రవర్తించారు. సామాజిక దూరం నిబంధనలను గంగలో కలిపేసి చిన్నారులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Updated Date - 2020-05-19T04:12:54+05:30 IST