ప్లాజ్మా థెరపీకి వైద్యులు సిద్ధం.... ముందుకు రాని కరోనా నుంచి కోలుకున్నవారు!
ABN , First Publish Date - 2020-06-22T18:04:50+05:30 IST
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ ఆసుపత్రిలో కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్లాస్మా థెరపీ విధానానికి ఆమోదం తెలిపింది. అయితే ప్లాజ్మాను దానం చేసేందుకు...

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ ఆసుపత్రిలో కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్లాస్మా థెరపీ విధానానికి ఆమోదం తెలిపింది. అయితే ప్లాజ్మాను దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్నవారు ముందుకు రావడం లేదు. కాగా ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్ -19 వ్యాధి బారిన పడిన వారికి చికిత్సనందించవచ్చు. ప్లాస్మా థెరపీ విధానం ద్వారా కరోనా బాధితుని శరీరంలో ప్రతిరోధకాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధానం ద్వారా బాధితుని శరీరంలోని కరోనా వైరస్ అంతమవుతుంది. అయితే గురునానక్ దేవ్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్సపొంది, దాని నుంచి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్లాజ్మా థెరపీ కోసం తాము కరోనా నుంచి కోలుకున్నవారిని సంప్రదిస్తున్నామని ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జి డాక్టర్ నీరజ్ శర్మ తెలిపారు. వారు ప్లాస్మా ఇచ్చేందుకు నిరాకరిస్తురన్నారు. ప్లాస్మాను దానం చేసేందుకు సందేహిస్తున్నారన్నారు. దీంతో బాధితులకు ప్లాజ్మా థెరపీ చేయలేకపోతున్నామని తెలిపారు.