కరోనా పుట్టుకపై దర్యాప్తునకు ఇది సమయం కాదు: చైనా

ABN , First Publish Date - 2020-05-18T23:37:22+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలపై పరిశోధనలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చైనా అంటోంది.

కరోనా పుట్టుకపై దర్యాప్తునకు ఇది సమయం కాదు: చైనా

బీజింగ్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలపై పరిశోధనలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చైనా అంటోంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 3లక్షలపైగా ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి పుట్టుక, వ్యాప్తిపై పరిశోధనలు ఇప్పుడే పరిశోధనలు చేయడం తగదని ఆ ప్రకటనలో చైనా తెలిపింది. కరోనా ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేయాలంటూ వివిధ దేశాలు చేసిన డిమాండ్లకు చైనా ఈ విధంగా బదులిచ్చింది. అయితే చైనా ల్యాబుల్లోనే కరోనా వైరస్ తయారయిందన్న ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండించింది.

Updated Date - 2020-05-18T23:37:22+05:30 IST