తల్లికి కోవిడ్ పాజిటివ్.. సోదరితో కలిసి ఐసోలేషన్‌లోకి ‘ప్రస్థానం’ నటుడు

ABN , First Publish Date - 2020-05-17T23:21:52+05:30 IST

బాలీవుడ్ నటుడు సత్యజీత్ దూబే ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. చివరిసారి ‘ప్రస్థానం’ సినిమాలో సంజయ్ దత్, అలీ

తల్లికి కోవిడ్ పాజిటివ్.. సోదరితో కలిసి ఐసోలేషన్‌లోకి ‘ప్రస్థానం’ నటుడు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సత్యజీత్ దూబే ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. చివరిసారి ‘ప్రస్థానం’ సినిమాలో సంజయ్ దత్, అలీ ఫజల్, మనీషా కొయిరాలతో కలిసి నటించిన సత్యజీత్.. తన తల్లికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో సోదరితో కలిసి ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. 


మైగ్రైన్, తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న తన తల్లికి గురువారం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నాడు. దీంతో తాను, తన సోదరి ఇద్దరం హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు వివరించాడు. ఇప్పటి వరకు తమకు ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నాడు. ప్రభుత్వ మార్గదర్వకాల ప్రకారం తమంత తామే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు చెప్పాడు. ఇప్పటి వరకైతే తమలో కోవిడ్ లక్షణాలు లేవన్నాడు.   


వీడియో కాల్స్ ద్వారా తల్లితో టచ్‌లోనే ఉంటున్నామని, ఆమె బాగానే ఉన్నారని సత్యజీత్ తెలిపాడు. ఈ సమాజానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, ఇరుగుపొరుగు వారు బోల్డంత మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారని అన్నాడు. ఒక మహమ్మారి మనల్ని ఇంత దగ్గర చేస్తుందని ఊహించలేదని సత్యజీత్ పేర్కొన్నాడు. 


అంతకుముందు సత్యజీత్ ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తన తల్లికి కరోనా వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆమె నానావతి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ఆమె త్వరగా కోలుకుని ఇంటికి వస్తారని తనకు తెలుసని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-05-17T23:21:52+05:30 IST