ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కార కేసు వద్దు

ABN , First Publish Date - 2020-07-28T07:31:21+05:30 IST

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారణ జరపనుండడంపై పునరాలోచించాలని 130 మందికి పైగా ప్రముఖులు.....

ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కార కేసు వద్దు

సుప్రీంకోర్టును కోరిన 130 మంది ప్రముఖులు


న్యూఢిల్లీ, జూలై 27: సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారణ జరపనుండడంపై పునరాలోచించాలని 130 మందికి పైగా ప్రముఖులు కోరారు. న్యాయస్థానానికి ఈ వినతి చేసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎంబీ లోకుర్‌, ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌, మాజీ ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. 

Updated Date - 2020-07-28T07:31:21+05:30 IST