హిట్లర్‌ నాటి న్యాయాన్ని చూస్తున్నట్లుందా?

ABN , First Publish Date - 2020-12-28T07:55:16+05:30 IST

బీజేపీ హయాంలో న్యాయవ్యవస్థ హిట్లర్‌ హయాంను గుర్తుచేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పరోక్ష విమర్శలు చేశారు. హిట్లర్‌ పాలనలో న్యాయవ్యవస్థపై రాసిన ఒక పుస్తకంలోని కొన్ని వ్యాక్యాలను...

హిట్లర్‌ నాటి న్యాయాన్ని చూస్తున్నట్లుందా?

  • ట్విటర్‌లో ప్రశాంత్‌ భూషణ్‌ ప్రశ్న

న్యూఢిల్లీ, డిసెంబరు 27: బీజేపీ హయాంలో న్యాయవ్యవస్థ హిట్లర్‌ హయాంను గుర్తుచేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పరోక్ష విమర్శలు చేశారు. హిట్లర్‌ పాలనలో న్యాయవ్యవస్థపై రాసిన ఒక పుస్తకంలోని కొన్ని వ్యాక్యాలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘హిట్లర్‌ ఏ తీర్పు ఇస్తాడో ఊహించి, న్యాయమూర్తులు అదే తీర్పు ఇవ్వాలి. నాజీ సిద్ధాంతాల ప్రకారమే కేసుల్లో తీర్పులు ఉండాలి’’ అనేది ఆ వాక్యాల సారాంశం. ‘‘హిట్లర్‌ జమానాలో న్యాయవ్యవస్థ పరిస్థితి ఇదే. ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తోందా’’ అంటూ ప్రశాంత్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2020-12-28T07:55:16+05:30 IST