చేయి చాపితే తీర్థం

ABN , First Publish Date - 2020-06-21T07:10:56+05:30 IST

‘గుడికి వెళ్లాం.. కరోనా నేపథ్యంలో తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదు’ అని నిరాశ చెందే భక్తులకు శుభవార్త. కర్ణాటకలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థు లు దీనికి పరిష్కారం కనుగొన్నారు. కరోనా వైర్‌సను నియంత్రించే చర్యల్లో భాగంగా ఆలయాల్లో తీర్థ...

చేయి చాపితే తీర్థం

  • సెన్సర్లతో పనిచేసే ‘మిషన్‌ అర్చక’ యంత్రం
  • 2,700కే తయారు చేసిన బీటెక్‌ విద్యార్థులు
  • ఆలయాల్లో ఏర్పాటుకు అర్చక సంఘం సూచన

బెంగళూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘గుడికి వెళ్లాం.. కరోనా నేపథ్యంలో తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదు’ అని నిరాశ చెందే భక్తులకు శుభవార్త. కర్ణాటకలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు దీనికి పరిష్కారం కనుగొన్నారు. కరోనా వైర్‌సను నియంత్రించే చర్యల్లో భాగంగా ఆలయాల్లో తీర్థ, ప్రసాదాల పంపిణీ ని ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఆలయానికి వచ్చే భక్తు లు.. దైవదర్శనం తర్వాత తీర్థం తీసుకుంటేనే సంతృప్తి అనే భావనతో ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉడుపి జిల్లా ని ట్టె మహాలింగ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మనిషి స్పర్శ లేకుండానే తీర్థం వచ్చే ‘మిషన్‌ అర్చక’ యంత్రాన్ని రూపొందించారు.


కళాశాల ఆవరణలోని మహాగణపతి గుడిలో దీన్ని ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. పూజకు సిద్ధం చేసిన తీర్థా న్ని ఒక క్యాన్‌లో వేస్తారు. దానికి చిన్నపైపు ఉన్న యంత్రాన్ని అమరుస్తారు. భక్తులు ఆ యంత్రం వద్ద చేయి చాచితే, 5-10 ఎంఎల్‌ తీర్థం వస్తోంది. ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ సాంకేతికతతో ‘మిషన్‌ అర్చక’ పనిచేస్తుందని కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ సంతోష్‌ తెలిపారు. రూ.2,700 వెచ్చించి ‘మిషన్‌ అర్చక’ను త యారు చేసినట్టు చెప్పారు. సాధారణ ఆలయాలలోనూ ‘మిషన్‌ అర్చక’ను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించేలా దేవదాయశాఖ మంత్రి కోట శ్రీనివాస పూజారి దృష్టికి తీసుకెళతామని రాష్ట్ర అర్చకుల సంఘం అధ్యక్షుడు జానకిరామ్‌ చెప్పారు.


Updated Date - 2020-06-21T07:10:56+05:30 IST