‘దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ఉద్యోగాలివ్వలేడు’

ABN , First Publish Date - 2020-11-01T02:22:28+05:30 IST

సాక్షాత్తూ దేవుడే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, అందరికీ ప్రభుత్వోద్యోగాలు

‘దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ఉద్యోగాలివ్వలేడు’

పనజీ : సాక్షాత్తూ దేవుడే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, అందరికీ ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేడని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. వెబ్ కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామ పంచాయతీల ప్రతినిథులతో శనివారం ఆయన మాట్లాడారు. నూటికి నూరు శాతం ప్రభుత్వోద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. రేపు ఉదయాన్నే సాక్షాత్తూ భగవంతుడే ముఖ్యమంత్రి పదవిని  అధిష్ఠించినప్పటికీ, అది సాధ్యం కాదన్నారు. 


ఈ సందర్భంగా ఆయన ‘స్వయంపూర్ణ మిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం, ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు గ్రామాలకు స్వయంగా వస్తారని చెప్పారు. 


Read more