యూపీఏ, ఎన్డీయే హయాంలో కనీస మద్దతు ధరను పోల్చుతూ ప్రకాశ్ జవదేకర్ ట్వీట్

ABN , First Publish Date - 2020-09-22T00:59:29+05:30 IST

ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్

యూపీఏ, ఎన్డీయే హయాంలో కనీస మద్దతు ధరను పోల్చుతూ ప్రకాశ్ జవదేకర్ ట్వీట్

న్యూఢిల్లీ : ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో కనీస మద్దతు ధర, మోదీ హయాంలో కనీస మద్దతు ధరను పోల్చుతూ ఎంత మేర పెరిగిందో ఆయన పేర్కొన్నారు. 

ఎర్ర పప్పు : యూపీఏ హయాంలో 2950, ప్రస్తుతం: 5100 రూపాయలు

మినప పప్పు : యూపీఏ హయాంలో 4,300 రూపాయలు, ప్రస్తుతం: 6,000 రూపాయలు

పెసర పప్పు : యూపీఏ హయాంలో 4,500, ప్రస్తుతం: 7,196

కందిపప్పు : యూపీఏ హయాంలో 4,300, ప్రస్తుతం : 6,000

శనగలు : యూపీఏ హయాంలో 3,100, ప్రస్తుతం 5,100

ఆవాలు : యూపీఏ హయాంలో 3050, ప్రస్తుతం 4,650 రూపాయలు అంటూ ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-22T00:59:29+05:30 IST