ఏనుగుల్ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం : ప్రకాశ్ జవదేకర్

ABN , First Publish Date - 2020-06-04T15:39:00+05:30 IST

కేరళలో ఏనుగుల్ని చంపిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏనుగుల్ని చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని,

ఏనుగుల్ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం : ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ : కేరళలో ఏనుగుల్ని చంపిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏనుగుల్ని చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, కఠినంగా శిక్షిస్తామని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. దోషులను పట్టుకోడానికి, వారికి శిక్ష వేయడానికి  ఏ అవకాశాన్ని వదులుకోమని, కచ్చితంగా వారికి శిక్షలు వేస్తామని తేల్చి చెప్పారు. వణ్య ప్రాణులను హింసించడం.. ఇలాంటి అకృత్యాలకు దిగడం భారతీయ సంస్కృతి కాదని ఆయన తెలిపారు.


మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం సమగ్ర నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనగానే ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని, అమాయక జంతువులపై అలాంటి నేరపూరిత చర్యలు చేయడం.. మానవ హత్యల కంటే ఏమాత్రం భిన్నం కాదని రతన్ టాటా తెలిపారు. 

నేర దర్యాప్తు బృందాన్ని నియమించిన కేరళ సర్కార్ 

ఏనుగు మృతి ఘటనపై విచారణకు పినరయ్ సర్కార్ వన్యప్రాణి నేర దర్యాప్తు బృందాన్ని నియమించింది. దర్యాప్తు బృందాన్ని పాలక్కడ్‌కు పంపామని, ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైందని సీఎం పినయ్ విజయన్ ప్రకటించారు. కేరళలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో గత నెల 27న ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే.


ఆహారం కోసం గ్రామంలోకి గర్భంతో ఉన్న  ఏనుగు ప్రవేశించింది. స్థానికులు దానికి పైనాపిల్‌లో బాంబు పెట్టి ఇచ్చారు. అది కాస్త నోట్లో పెట్టుకోవడంతో ఒక్కసారిగా బాంబు పేలి తీవ్ర రక్తస్రావం అయ్యింది. దగ్గర్లో ఉన్న నదిలోకి వెళ్లి... సేద తీరింది. కొద్ది రోజుల్లోనే ఆ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-06-04T15:39:00+05:30 IST