గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఔషధ మొక్కలను నాటిన ప్రభాస్ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2020-10-31T22:31:48+05:30 IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఔషధ మొక్కలను నాటిన ప్రభాస్ ఫ్యాన్స్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఔషధ మొక్కలను నాటిన ప్రభాస్ ఫ్యాన్స్

బెంగళూరు: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఔషధ గుణాల మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ అడవి దత్తతను స్ఫూర్తిగా తీసుకొని బెంగళూరులో ప్రభుత్వ కిడ్వాయి క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక (పీఎఫ్ఏకే) ఆధ్వర్యంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో చిన్న దట్టమైన అడవిని ఏర్పాటు చేశారు. 


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక గౌరవ అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ రెడ్డి అన్నారు. దీనిలో తమ అభిమాన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొని మొక్కలు నాటడమే కాకుండా 1600 ఎకరాల అడవిని దత్తత తీసుకొని దాని అభివృద్ధి కోసం ఐదు కోట్ల రూపాయలను అందించడం జరిగిందని రంజిత్ రెడ్డి చెప్పారు. 


దానిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేడు బెంగుళూరు పట్టణంలోని డైరీ సర్కిల్ వద్ద ప్రభుత్వ కిడ్వాయి క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో  ఖాళీ ప్రదేశంలో ఔషధ గుణాలు కలిగి క్యాన్సర్‌ను నియంత్రించే మొక్కలు, అదే విధంగా దోమలను నియంత్రించే దాదాపు 180 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ రోజు మేము నాటిన మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత ఆస్పత్రి నందు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఔషధ గుణాలు కలిగిన ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా వ్యాధి నయం అవుతుందని చెప్పారు. అదేవిధంగా ఆస్పత్రి ప్రాంగణంలో దోమలు లేకుండా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  


ప్రతి సంవత్సరము తమ అభిమాన నటులు ప్రభాస్, కృష్ణంరాజును స్ఫూర్తిగా తీసుకొని వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  ఈ సంవత్సరం ఆస్పత్రి ప్రాంగణంలో అడవిని ఏర్పాటు చేసి దాని అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. దీనివలన రోగులకే కాకుండా ఆస్పత్రికి వచ్చే వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. తాము చేపట్టే ఈ కార్యక్రమానికి తమ వెంట ఉన్న కిడ్వాయి ఆస్పత్రి వారికి ఇండియన్ హెర్బ్స్  ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పార స్విమ్మర్ నిరంజన్ ముకుందన్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక అధ్యక్షులు అశ్విన్ రెడ్డి, కార్యదర్శి ఆశిక్, ఆస్పత్రి  పీఆర్వో బసప్ప, ఇండియన్ హెర్బ్స్ పౌండర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2020-10-31T22:31:48+05:30 IST