రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టులు.. ఇద్దరిపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2020-04-21T21:02:27+05:30 IST

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధుర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టులు.. ఇద్దరిపై ఎఫ్ఐఆర్

లక్‌నవూ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధుర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉమేష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా వీరిలో చౌదరి సంకేత్ అగర్వాల్ అనే వ్యక్తి ఒకరని మధుర పోలీసులు తెలిపారు. వారి ఫేస్‌బుక్ పోస్టులు కాంగ్రెసీయులను గాయపరిచేవిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐటీ చట్టం (సవరణ) 2008, భారత శిక్షస్మృతిలోని సెక్షన్ 295 ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-04-21T21:02:27+05:30 IST