బిహార్‌లో అధికార - ప్రతిపక్ష పోస్టర్ వార్

ABN , First Publish Date - 2020-06-11T21:30:45+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు కాస్తా... అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టర్ వార్‌కు దారి తీసింది.

బిహార్‌లో అధికార - ప్రతిపక్ష పోస్టర్ వార్

పాట్నా : మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు కాస్తా... అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టర్ వార్‌కు దారి తీశాయి. ప్రతిపక్ష జేడీయూ లాలూకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లను చూపించగా... అధికార జేడీయూ మాత్రం... లాలూ ప్రసాద్.. అతని కుటుంబీకులకు చెందిన 73 రకాల ఆస్తుల  పట్టికను చూపిస్తూ దాని పక్కనే మరో పోస్టర్‌ను పెట్టింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీసింది.


‘‘లాలూది 73 వ పుట్టిన రోజు. 73 రకాల ఆస్తులను ఎలా సిద్ధం చేశారో చూడండి. లాలూ కుటుంబ ఆస్తుల వివరాలు... 73 వ పుట్టిన రోజు.. 73వ ఆస్తి సిరీస్’ అంటూ జేడీయూ పోస్టర్ వెలసింది. అంతేకాకుండా ‘‘రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన మరిన్ని ఆస్తుల వివరాలను కొన్ని రోజుల్లోనే మీ ముందు పెడతాం’’ అని జేడీయూ పేర్కొనడంతో రాజకీయం మరింత వేడెక్కింది. 


మరోవైపు తన తండ్రి లాలూ ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కుమారుడు, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘నాకు నాన్న అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. పోరాటాలు చాలా ఎక్కువ కాలం కొనసాగుతాయి. పరీక్షా కాలం ఎదురవుతుంది... కానీ భయపడవద్దు. వెనుదిరుగొద్దు.. బిహార్ అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం  పోరాటం చేయాలి. చావడానికైనా సిద్ధంగా ఉండాలి.’’ అన్న లాలూ మాటలను తేజస్వీ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఉటంకించారు. 


Updated Date - 2020-06-11T21:30:45+05:30 IST