గ్యాంగ్‌స్టర్ల ఫొటోలతో పోస్టల్ స్టాంపులు
ABN , First Publish Date - 2020-12-28T23:01:15+05:30 IST
గ్యాంగ్‌స్టర్ల ఫొటోలతో పోస్టల్ స్టాంపులు

లఖ్‌నవూ: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పోస్టల్ విభాగం చేసిన ఘనకార్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడమే కాకుండా అనేక విమర్శలకు దారి తీస్తోంది. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్‌స్టర్ మున్నా బజ్‌రంగీల ఫొటోలతో పోస్టల్ స్టాంపులు విడుదల చేయడమే ఈ విమర్శలకు కారణం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మై స్టాంప్’ పథకంలో భాగంగా పోస్టల్ స్టాంపులు ముద్రిస్తున్న క్రమంలో ఈ తప్పిదం జరిగినట్లు స్థానిక పోస్టల్ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
‘‘కస్టమర్ల ఫొటోగ్రాఫ్, కొన్ని వ్యవస్థల లోగోలు ఆర్ట్ వర్క్ ఇమేజ్‌లు, చారిత్రక నగరాలు, అడవికి సంబంధించిన చిత్రాలు, జంతువుల-పక్షుల ఫొటోలు, ఇతర ఎన్నో చిత్రాలు మా వద్ద ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసే క్రమంలో ఈ తప్పిదం జరిగింది’’ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ చిత్రంతో విడుదలైన పోస్టల్ స్టాంప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, దీనిపై విచారణ కొనసాగుతోందని, తొందరలోనే చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.