కనీస నిల్వ లేకుంటే ఖాతా రద్దు: ఇండియా పోస్ట్

ABN , First Publish Date - 2020-12-12T01:18:35+05:30 IST

కనీస నిల్వ లేకుంటే ఖాతా రద్దు: ఇండియా పోస్ట్

కనీస నిల్వ లేకుంటే ఖాతా రద్దు: ఇండియా పోస్ట్

న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది.


పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. ఖాతాదారులు ఈ నిబంధనను పాటించకపోతే రూ. 100 మరియు జీఎస్టీ జరిమానా వసూలు చేయబడుతుందని పేర్కొంది. ఖాతా బ్యాలెన్స్ సున్నా అయితే, కొత్త నియమం ప్రకారం ఖాతా మూసివేయబడుతుందని ఇండియా పోస్ట్ వెల్లడించింది.

Updated Date - 2020-12-12T01:18:35+05:30 IST