దూబే గ్యాంగ్ చంపిన పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ వివరాలు

ABN , First Publish Date - 2020-07-14T13:40:06+05:30 IST

కాన్పూరులో కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ హతమార్చిన 8 మంది పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.....

దూబే గ్యాంగ్ చంపిన పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ వివరాలు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కాన్పూరులో కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ హతమార్చిన 8 మంది పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కాన్పూర్ నగర సమీపంలోని బిక్రూ గ్రామంలో ఈ నెల 2వతేదీ రాత్రి డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు 8 మంది పోలీసులను వికాస్ దూబే ముఠా అత్యంత పాశవికంగా దాడి చేసి హతమార్చింది. దేవేంద్రమిశ్రాపై ముఠా సభ్యులు నాలుగుసార్లు కాల్పులు జరిపారని, అతని శరీరంలో నుంచి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని పోస్టుమార్టం నివేదికలో వెలుగుచూసింది. ఓ బుల్లెట్ తలలో నుంచి, మరో బుల్లెట్ ఛాతీ, మరో రెండు బుల్లెట్లు కడుపులో నుంచి దూసుకుపోయాయి. కాల్పులు జరిపాక డిఎస్పీ మిశ్రా కాలును నరికేశారు. పోలీసులపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లోనే కాల్చారని తేలింది. ముగ్గురు పోలీసులను తల, ముఖంపైనే కాల్పులు జరిపారు. 8మంది పోలీసులను అత్యంత పాశవికంగా కాల్చి చంపారని పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. బిక్రూ ఘటనపై యూపీ సర్కారు దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై రిటైర్డు జస్టిస్ శశికాంత్ అగర్వాల్ నేతృత్వంలో విచారణ కమిషన్ ను సర్కారు నియమించింది. పోలీసుల పోస్టుమార్టం నివేదిక కమిషన్ కు వైద్యులు అందజేశారు. 

Updated Date - 2020-07-14T13:40:06+05:30 IST