ఢిల్లీలో తగ్గుతున్న కరోనా.. కొత్తగా 2వేల కరోనా కేసులు!
ABN , First Publish Date - 2020-12-13T11:51:35+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం ఇక్కడ 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం ఇక్కడ 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 47 మంది కరోనా కారణంగా మరణించినట్లు తెలిపారు. అయితే నవంబరు 2 నుంచి గణాంకాలను పరిశీలిస్తే.. ఒకరోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇప్పటి వరకూ ఇవే తక్కువని అధికారులు అంటున్నారు.
అలాగే వైరస్ పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గిందని, ప్రస్తుతం ఈ రేటు 2.64శాతమే ఉందని వాళ్లు వెల్లడించారు. డిసెంబరు 3న కూడా ఈ రేటు సుమారు 5 వరకూ ఉందని, కానీ ఇప్పుడు ఇది దాదాపు సగానికి తగ్గిపోయిందని తెలియజేశారు. కొత్తగా 73, 413మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో కేవలం 1935మందికి మాత్రమే పాజిటివ్ ఫలితం వచ్చిందని వెల్లడించారు. అలాగే కొత్తగా 47 కరోనా మరణాలతో ఢిల్లీలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాల సంఖ్య 9,981కు చేరిందని పేర్కొన్నారు.