అనుమానాస్ప‌ద స్థితిలో ప్ర‌ముఖ కళాకారుడు మృతి

ABN , First Publish Date - 2020-08-20T15:24:21+05:30 IST

ప్రముఖ క‌ళాకారుడు రామ్ ఇంద్ర‌నీల్‌ కామత్(41) అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ముంబైలోని అత‌ని ఇంటిలోని బాత్‌టబ్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించారు. పోలీసులు దీనిని ప్రమాదవశాత్తూ సంభవించిన..

అనుమానాస్ప‌ద స్థితిలో ప్ర‌ముఖ కళాకారుడు మృతి

ముంబై: ప్రముఖ క‌ళాకారుడు రామ్ ఇంద్ర‌నీల్‌ కామత్(41) అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ముంబైలోని అత‌ని ఇంటిలోని బాత్‌టబ్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించారు. పోలీసులు దీనిని ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా గుర్తించి, కేసు నమోదు చేశారు. ఆత్మ‌హ‌త్య కోణంలోనూ పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. రామ్ ఇంద్ర‌నీల్‌ కామత్ ఇంటిలో పోలీసుల‌కు ఒక సూసైడ్‌నోట్ ల‌భ్య‌మ‌య్యింది. దానిలో తాను ఎవరినీ బాధపెట్టలేదని రాసివుంది. కాగా ఈ కేసులో పోలీసులు మృతుని కుటుంబ స‌భ్యులు, దగ్గరి బంధువులను విచారిస్తున్నారు. కాగా రామ్ కామత్ కొంత‌కాలంతా మాన‌సిక‌ ఒత్తిడికి లోనవుతున్నార‌ని,  లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌రింత కుంగిపోయార‌ని తెలుస్తోంది. వృత్తిపరంగా ఇంద్ర‌నీల్‌ గ్లాస్ పెయింటింగ్ కళాకారుడు. ఫోటోగ్రాఫర్. ఆయ‌న‌ రూపొందించిన‌ గ్లాస్ వర్క్ పెయింటింగ్స్ ఎంతో ప్రసిద్ది చెందాయి. 

Updated Date - 2020-08-20T15:24:21+05:30 IST