రేపిస్ట్‌ ఫాదర్‌ను బహిష్కరించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

ABN , First Publish Date - 2020-03-02T08:52:54+05:30 IST

అత్యాచారం కేసులో దోషిగా తేలిన కేరళ సైరో-మలబార్‌ చర్చి ఫాదర్‌ రాబిన్‌ వడక్కుంచెరిని పోప్‌ ఫ్రాన్సిస్‌ బహిష్కరించారు. బాలలను లైంగికంగా దోపిడీ చేసే...

రేపిస్ట్‌ ఫాదర్‌ను బహిష్కరించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

కోచి, మార్చి 1 : అత్యాచారం కేసులో దోషిగా తేలిన కేరళ సైరో-మలబార్‌ చర్చి ఫాదర్‌ రాబిన్‌ వడక్కుంచెరిని పోప్‌ ఫ్రాన్సిస్‌ బహిష్కరించారు. బాలలను లైంగికంగా దోపిడీ చేసే చర్చి అధికారుల పట్ల ఎటువంటి సహనమూ చూపరాదని పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పష్టం చేశారని అధికారులు చెప్పారు. బాలికపై అత్యాచారం కేసులో రాబిన్‌ శిక్ష అనుభవిస్తున్నాడు. 

కేరళ నన్‌ రెండో అభ్యర్థన తిరస్కరణ ఫ్రాన్సిస్కన్‌ క్లారిస్ట్‌ కాంగ్రిగేషన్‌ (ఎఫ్‌సీసీ) తనపై విధించిన బహిష్కరణను ఉపసంహరించాలని కేరళ నన్‌ లూసీ కలపుర (52) పెట్టుకున్న రెండో అభ్యర్థనను వాటికన్‌ తిరస్కరించింది.

Updated Date - 2020-03-02T08:52:54+05:30 IST