11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నవంబరు 9న

ABN , First Publish Date - 2020-10-13T21:25:09+05:30 IST

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 11 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి. భారత ఎన్నికల సంఘం

11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నవంబరు 9న

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 11 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఈ వివరాలను ప్రకటించింది. 


ఈసీఐ ప్రకటన ప్రకారం, ఉత్తరాఖండ్‌లో 1 రాజ్యసభ స్థానానికి, ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు  ఎన్నికలు నవంబరు 9న జరుగుతాయి. నామినేషన్లను దాఖలు చేసేందుకు చివరి తేదీ అక్టోబరు 27, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 2. 


రాజ్యసభ ఎన్నికలు నవంబరు 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


ఇదిలావుండగా, వచ్చే నెలలో పదవీ కాలం ముగిసే రాజ్యసభ సభ్యుల్లో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ఉన్నారు.


Updated Date - 2020-10-13T21:25:09+05:30 IST