మరికొద్ది గంటల్లో పోలింగ్... కేజ్రీవాల్‌కు ఈసీ షాక్...

ABN , First Publish Date - 2020-02-08T01:04:55+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం నోటీసు ఇచ్చింది. ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొంది.

మరికొద్ది గంటల్లో పోలింగ్... కేజ్రీవాల్‌కు ఈసీ షాక్...

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం నోటీసు ఇచ్చింది. ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. 

కేజ్రీవాల్ ట్వీట్ చేసిన వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. శనివారం సాయంత్రం 5 గంటలలోగా సమాధానం సమర్పించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. 

ఇదిలావుండగా కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీలోని పురాతన హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా బీజేపీ నేత పర్వేశ్ వర్మపై పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఆరోపించిన పర్వేశ్ వర్మకు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు. 

Updated Date - 2020-02-08T01:04:55+05:30 IST