మందకొడిగా సాగుతున్న పోలింగ్
ABN , First Publish Date - 2020-02-08T20:37:49+05:30 IST
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి పోలింగ్ 28.14 శాతంగా నమోదైంది. ఎన్నికల కమిషన్ ఓటర్ టర్నవుట్ యాప్ ప్రకారం, ఈశాన్య ఢిల్లీలో ..

న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి పోలింగ్ 28.14 శాతంగా నమోదైంది. ఎన్నికల కమిషన్ ఓటర్ టర్నవుట్ యాప్ ప్రకారం, ఈశాన్య ఢిల్లీలో ఇంతవరకూ 34.82 శాతం, ఈస్ట్ ఢిల్లీలో 31.31 శాతం, వాయవ్య ఢిల్లీలో 28.78 శాతం, వెస్ట్ ఢిల్లీలో 26.77 శాతం, సౌత్ ఢిల్లీలో 26.72 శాతం, నైరుతి ఢిల్లీలో 23.25, సెంట్రల్ ఢిల్లీలో 25.36 శాతం పోలింగ్ నమోదైంది. 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6.00 గంటలతో ముగియనుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.12 శాతం పోలింగ్ నమోదైంది.