ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ర్యాలీలకు అనుమతినిచ్చిన కేంద్ర హోంశాఖ

ABN , First Publish Date - 2020-10-09T00:05:09+05:30 IST

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను భారీ స్థాయిలో సడలించింది. ఎన్నికలు

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ర్యాలీలకు అనుమతినిచ్చిన కేంద్ర హోంశాఖ

పాట్నా : ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను భారీ స్థాయిలో సడలించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. ఈ సడలింపు తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మాములుగా అయితే పాత సడలింపుల ప్రకారం అక్టోబర్ 15 వరకూ ఈ ర్యాలీలకు అనుమతి లేదు. కానీ హోంశాఖ మాత్రం తక్షణమే అమలులోకి వచ్చేలా నిబంధనలను సడలించింది. కేవలం బిహార్ ప్రాంతంలోనే కాకుండా... ఉప ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, కర్నాటక, హర్యానా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఈ సడలింపు వర్తిస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 


Updated Date - 2020-10-09T00:05:09+05:30 IST