కరోనాపై ఈ పోరాటం సరిపోదు: ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2020-03-29T04:35:46+05:30 IST

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పొలిటికల్ అనలిస్ట్....

కరోనాపై ఈ పోరాటం సరిపోదు: ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిశోర్ మాత్రం పెదవి విరిచాడు. కరోనాను ఎదుర్కోవడానికి ఇది మాత్రమే సరిపోదని, ఇండియా ఇంకెంతో చేయగలదంటూ శనివారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఏదో లాక్ డౌన్ పెట్టేశాం కదా అని చేతులు దులుపుకొని కూర్చోవడం సమంజసం కాదని, కరోనాను నిర్మూలించేందుకూ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 10 మందికి మాత్రమే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల లాభమేంటని ప్రశ్నించాడు. 


ముఖ్యంగా కరోనాకు ట్రీట్మెంట్ లేదని, దీనికి తోడు మన దేశంలో వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కూడా అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని, దీనివల్ల  కరోనాను అరికట్టడం అసాధ్యమైపోతుందని పీకే వ్యాఖ్యానించాడు. ఇండియా వంటి దేశం ఇంతకంటే ఎన్నోరెట్లు గొప్పగా కరోనాను ఎదుర్కోగలదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని ప్రశాంత్ కిశోర్ సూచించాడు.

Updated Date - 2020-03-29T04:35:46+05:30 IST