సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త!

ABN , First Publish Date - 2020-03-03T03:14:28+05:30 IST

స్మార్ట్ ఫోన్లు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. చాలా వరకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు...

సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త!

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్లు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. చాలా వరకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు మంచిగానే ఉండడంతో పాటు వాటిని అసలు వ్యక్తులే అమ్ముతూ ఉంటారు. అయితే కొందరు ఇటీవల ఆన్‌లైన్‌ మార్కెట్‌ను ఆసరాగా చేసుకుని సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటించారు. ప్రత్యేకించి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు మూడు విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచించారు.


ఎవరైనా మీకు ఫోన్ అమ్మేందుకు తొందరపడుతున్నారంటే అది ఎక్కడో దొంగిలించిన ఫోన్ అయ్యుండవచ్చుననీ... అదే జరిగితే సమస్యల్లో పడక తప్పదని పోలీసులు పేర్కొన్నారు. ఇక రెండో విషయం,  అమ్మే వ్యక్తి ఆన్‌లైన్‌ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ కోసమే డిమాండ్ చేస్తే.. అతడు ఆన్‌లైన్‌లో ఎలాంటి చెల్లింపు రికార్డులు లేకుండా జాగ్రత్త పడుతున్నాడని అర్థం. మూడోది.. క్యూఆర్ కోడ్ చెల్లింపులు. సెల్‌ఫోన్ అమ్మే వ్యక్తి మిమ్మల్ని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించమని ప్రత్యేకంగా కోరాడంటే.. డబ్బులెవరికి చెల్లిస్తున్నామో తెలియకుండా ఉండేందుకే అలా అడిగే అవకాశం ఉందని గ్రహించాలి. కాబట్టి ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి యాప్‌ల ద్వారా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారు జాగ్రత్త ఉండాలి మరి!

Updated Date - 2020-03-03T03:14:28+05:30 IST