యువతి చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్.. సీఎం సీరియస్!

ABN , First Publish Date - 2020-07-29T02:49:01+05:30 IST

పోలీసు ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో అధికారి. నడిరోడ్డుపై ఓ యువతి చెంప పగలగొట్టాడు.

యువతి చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్.. సీఎం సీరియస్!

రాంచీ: పోలీసు ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో అధికారి. నడిరోడ్డుపై ఓ యువతి చెంప పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకొని గుంజాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. అలా విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన చాలా సీరియస్ అయ్యారు. డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన, అనుచితమైన ప్రవర్తనను అస్సలు భరించకూడదు’ అని ట్వీట్ చేశారు. వీడియోలోని పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన డీజీపీ సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Updated Date - 2020-07-29T02:49:01+05:30 IST