రైలు పట్టాల పక్కన పోలీసు పెట్రోలింగ్

ABN , First Publish Date - 2020-05-13T12:46:31+05:30 IST

రైలు పట్టాలపై వలసకార్మికులు రాకపోకలు సాగించకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు....

రైలు పట్టాల పక్కన పోలీసు పెట్రోలింగ్

ఔరంగాబాద్ (మహారాష్ట్ర): దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో రైలు పట్టాలపై వలసకార్మికులు రాకపోకలు సాగించకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది వలసకార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు పట్టాలపై నడిచి వెళుతూ అలసిపోయి అక్కడే పడుకోవడంతో గూడ్స్ రైలు కింద పడి 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం ఔరంగాబాద్ మార్గంలోని రైలు పట్టాల పక్కన పోలీసులు పహరా కాస్తున్నారు. రైలు పట్టాలపై వలసకార్మికులు నడచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని ఔరంగాబాద్ పోలీసులు చెప్పారు. శ్రామిక్ స్పెషల్స్ తోపాటు ప్రత్యేక రైళ్లు, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు రైలు పట్టాల పక్కన పెట్రోలింగ్ చేస్తున్నారు. 

Read more