చెప్పేది మీ ఆరోగ్యం కోసమే.. వినండ్రా బాబూ...!

ABN , First Publish Date - 2020-03-28T16:51:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ‘కరోనా’ ను అడ్డుకొనేలా దేశవ్యాప్తంగా 21 రోజులు

చెప్పేది మీ ఆరోగ్యం కోసమే.. వినండ్రా బాబూ...!

  • వాహనచోదకులకు పోలీసులు వినూత్న అవగాహన

చెన్నై: ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు మీ ఆరోగ్య భద్రత కోసమేనని పేర్కొన్న పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారికి వినూత్నంగా అవగాహన కల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ‘కరోనా’ ను అడ్డుకొనేలా దేశవ్యాప్తంగా 21 రోజులు ‘లాక్‌ డౌన్‌’ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా కఠినమైన నిబంధనలను అమలుచేశారు పొరుగు రాష్ట్రాలు, అంతర జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు నిరోధించడంతో పాటు ఆయా సరిహద్దుల్లో చెక్‌పో్‌స్టలను ఏర్పాటుచేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలంటూ ఆరోగ్య, పోలీసు శాఖలు కోరుతూ లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మాత్రం బయటకు రావాలని, దుకాణాల వద్ద మూడడుల దూరాన్ని ఉండేలా జాగ్రత్త చేపట్టాలని హెచ్చరిస్తున్నారు.


కానీ, కొందరు మాత్రం లాక్‌ డౌన్‌ ఎలా ఉందో చూసేందుకు ద్విచక్రవాహనాలపై వీధుల్లో విహరిస్తున్నారు. ముందు వాహనచోదకులను అడ్డుకొని వారికి నచ్చచెప్పి పోలీసులు ఇళ్లకు సాగనంపారు కానీ, మరి కొందరు మాత్రం వీదుల్లో తిరగడం మాత్రం ఆపడం లేదు, దీంతో, శుక్రవారం తిరువణ్ణామలై జిల్లా సెంగంతో పాటు పలు జిల్లాల్లో నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో వస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు వారిచేత గుంజీలు తీయించడంతో పాటు, కుటుంబాన్ని కాపాడుకొలేనే మరోసారి వాహనాల్లో తిరగమంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు.

Updated Date - 2020-03-28T16:51:33+05:30 IST