గంటకు 300 కిలోమీటర్లు..

ABN , First Publish Date - 2020-07-22T06:59:21+05:30 IST

ఇంత వేగంతో బైక్‌ నడపడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే! ఇంత నిర్లక్ష్యంగా బెంగళూరులో బైక్‌ను నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు...

గంటకు 300 కిలోమీటర్లు..

ఇంత వేగంతో బైక్‌ నడపడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే! ఇంత నిర్లక్ష్యంగా బెంగళూరులో బైక్‌ను నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ఎలకా్ట్రనిక్‌ సిటీ ఫ్లైవోవర్‌పై బైక్‌ నడిపిన వ్యక్తిని మునియప్పగా గుర్తించారు. అన్ని వాహనాలను దాటేస్తూ అతివేగంతో బైక్‌ నడిపిన వైనాన్ని సెల్ఫీ వీడియో తీశాడు. సోషల్‌ మీడియాలో అది వైరలైంది. అతివేగంతో డ్రైవింగ్‌ చేసిన అతనిపై కేసు నమోదు చేశామని జాయింట్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ ట్వీట్‌ చేశారు.


Updated Date - 2020-07-22T06:59:21+05:30 IST